3775) ఉదయించే దివ్యతార ఘోరాంధకార లోకాన


** TELUGU LYRICS **

ఉదయించే దివ్యతార ఘోరాంధకార లోకాన 
జన్మించే క్రీస్తు యేసు రక్షణవెలుగునియ్య (2)
అందముగా క్రీస్తేసుకు హల్లెలూయ ఆని పాడెదా (2)
హల్లెలూయ ఆమెన్ ఆమెన్  హల్లెలూయ (2)  
||ఉదయించే|| 

పరలోకతండ్రి మనలను కరుణించి పంపెను క్రీస్తు ప్రభున్ 
లోకందులకూ దృష్టి నివ్వ అరుదెంచే క్రీస్తు ప్రభు (2)
చీకటినుండి వెలుగునకు నడిపించ వచ్చెను రక్షకుడు 
ఆ వెలుగు ప్రకాశింప ఉదయించెను ఈ ధరలో  
||హల్లెలూయ||   ||ఉదయించే|| 

దూతలు గీతము పాడగా దర్శించే గొల్లలు 
తూర్పుదిక్కున చుక్క వెలుగియ్యగా పయనించే జ్ఞానులు (2)
నశించిన వారిని వెదకి రక్షింపగ వచ్చెను యేసు 
ఇమ్మానుయేలు దేవుడు మనలను నడిపించును 
||హల్లెలూయ||   ||ఉదయించే|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments