3774) శుభవచనం శుభాశీస్సులు సర్వోన్నతుని శుభాగమనం


** TELUGU LYRICS **

శుభవచనం శుభాశీస్సులు 
సర్వోన్నతుని శుభాగమనం (2)
దైవపుత్రుడు ధరకేతెంచెను (2)
ధన్యులము బహు ధన్యులము (2)  
||శుభవచనం|| 

దాసులను బహు దీనులను 
దేవుని వారసులను చెయను (2)
లోకరక్షకుడు యేసుప్రభు (2)
దీనుడై పుట్టెను ధన్యులము (2)
||శుభవచనం|| 

చీకటిలో మారణచ్చాయలో 
రక్షణతో వెలిగించుటకై (2)
వాత్సల్యముతో అరుణోదయ (2)
దార్శనమిచ్చెను ధన్యులము (2) 
||శుభవచనం|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------