3773) క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా


** TELUGU LYRICS **

క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా 
జగమంతా చాటను నిండు మనసుతో పరవశించను (2)
రారాజు మహారాజు జన్మించే ఈ ధరలో 
కొనియాడి కీర్తించి ఆరాధించెదము
 (2)
సంతోషమే సమాధానమే ఆశ్చర్యమే మహదానందమే
 (2)

సంతోషకరమైన శుభవార్త కాపరులకు తెలిసే ఈ వార్త 
లోకంలో లేని సంతోషం భువిపై తెచ్చింది ప్రభువార్త
 (2)
కృంగిన జీవితాలకు కృప చూపెను ఈ క్రిస్మస్ 
భయముతో ఉన్న వారికి బలపరచెను ఈ క్రిస్మస్
 (2) 
||సంతోషమే||

నిరీక్షణ లేని జనులకు నిరీక్షణ తెచ్చింది ఈ వార్త 
రక్షణ లేని జనులకు రక్షణ తెచ్చింది ప్రభు వార్త 
 (2)
పాపముతో ఉన్న వారికి పవిత్రపరచును క్రిస్మస్ 
బాధలలో ఉన్న వారికి బలపరచును ఈ క్రిస్మస్
 (2)
||సంతోషమే||

సమాధానం లేని మనుషులకు సమాధానం తెచ్చెను  ఈ వార్త 
సమాధానపరచెను తండ్రితో  శాంతి నొసగే ఈ ప్రభువార్త
 (2)
లయమయ్యే జీవితాలను లేవనెత్తు ఈ క్రిస్మస్ 
వ్యధలతో ఉన్న వారికి ఉత్తేజపరచును క్రిస్మస్
 (2)
||సంతోషమే||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------