3800) తూర్పుదేశపు జ్ఞానులకు త్రోవచూపెను నక్షత్రం

    

** TELUGU LYRICS **    

    తూర్పుదేశపు జ్ఞానులకు త్రోవచూపెను నక్షత్రం
    శిశువైనయేసుని చూచి సంతసించెను విచిత్రం (2)
    సాగిలిపడి పూజించెను కానుకలను అర్పించెను (2)
    యేసుమనలను రక్షించును,ఇమ్మానుయేలుగా తోడుండును (2)

    ఇదేయేకదా మనకు ఆనందము,
    ఇదేయేకదా క్రిస్మస్ సంతోషము (2)  
    ||తూర్పు||

1.  ప్రకాశమైన వేకువచుక్క మనయేసుక్రీస్తు ప్రభువు,
    రక్షకునిగా మనకొరకు జన్మించెను ఈభువియందు (2)
    లోకమందు తండ్రిచిత్తము నెరవేర్చగా యేసువచ్చెను
    భూమిమీద తనవారికి సమాధానములు తెచ్చెను (2)
    ||ఇదియేకదా||

2.  జనముమధ్య జీవవాక్యము చేతపట్టిన మనము
    ధరణియందు జ్యోతులవలే కనబడుచున్నామందరికి (2)
    గగనమందు తారలనుపోలి ప్రకాశించెదము నిత్యము
    తండ్రిరాజ్యములో సూర్యునివలే తేజరిల్లెదము మనము (2)
    ||ఇదియేకదా||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------