3781) రాజుల రాజు యేసు జన్మించే ఈనాడు ఆది అంతమైనవాడు అల్పుడైనాడు


** TELUGU LYRICS **

రాజుల రాజు యేసు జన్మించే ఈనాడు 
ఆది అంతమైనవాడు అల్పుడైనాడు (2)
రండి రారండి కొనియాడి పాడెదము 
రండి రారండి కీర్తించి పొగడెదము (2) 
||రాజుల రాజు|| 

దీనులకై దైవమె దిగివచ్చెను నేడు 
పాపులాకై పావనుడేసు ఉదయించినాడు (2)
ఉన్నత స్థానమునే విడిచి వచ్చినాడు 
పశువులపాకలో పవళించినాడు (2)
ఉన్నత స్థానమునే విడచి వచ్చినాడు (2)
||రండి రారండి|| 

మనకొరకై మ్రానుపై మరణించిన్నాడు 
మోక్షముకై మార్గముగా నిలిచెను యేసుడు (2)
రక్షణ మార్గము మన యేసునాధుడు 
నమ్మిన వారికి నిత్యజీవము 
నమ్మని వారికి నిత్య నరకము (2)
రక్షణ మార్గము మన యేసు నాధుడు (2)
||రండి రారండి|| ||రాజుల రాజు|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------