3804) రారండోయ్ రారండోయ్ రక్షకుని చూడగా రారండోయ్


** TELUGU LYRICS **

రారండోయ్ రారండోయ్ 
రారండోయ్ రారండోయ్ రక్షకుని చూడగా రారండోయ్ 
ప్రభుయేసుని చూడగా రారండోయ్ 
పరమాత్ముని కొలువగా రారండోయ్ (2)
సాగిలపడి ఆరాదింతుము మన రక్షకుని పూజింతుము 
హృదయమునే అర్పింతుము ప్రభుయేసు రారాజుకు (2)

కాపరులందరు విచ్చేసినారు హల్లెలూయా హల్లెలూయా 
పశువులతొట్టిలో చూసారు యేసుని హల్లెలూయా హల్లెలూయా
ఆరాధించిరి జ్ఞానులాయనను కానుకలే అర్పించిరి 
గొప్ప రక్షణను మనకిచ్చుటకు నిజవెలుగై ఉదయించెను 
||రారండోయ్|| 

పరలోక నివాసి భువికరుదెంచాడు హల్లెలూయా హల్లెలూయా 
మరణించుటకే జన్మించే మన యేసు హల్లెలూయా హల్లెలూయా 
గొర్రెపిల్లగా బలియాగమాయెను మనలను ఇల రక్షించెను 
నిత్య జీవాన్ని మనకు ఇచ్చుటకు మానవుడై దిగివచ్చెను
||రారండోయ్|| 

రాజులరాజు ఇల జన్మించాడు హల్లెలూయా హల్లెలూయా
శాశ్వత రాజ్యం మనకిచ్చును యేసు హల్లెలూయా హల్లెలూయా
యూదా సింహమై మరల రానుండెను మనలను ఇల కొనిపోవును 
పరలోకమునే మనకిచ్చుటకు మరణమునే జయించెను  
||రారండోయ్|| ||సాగిలపడి|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------