3766) పరిశుద్ధుడు పావనుడు పుడమిపై దిగివచ్చే పరము నుండి


** TELUGU LYRICS **

పరిశుద్ధుడు పావనుడు 
పుడమికి దిగివచ్చే పరము నుండి (2)
ఇమ్మానుయేలుగా ఇలకు వచ్చెను మనకు 
తోడునీడగా ఉండవచ్చెను (2)
పండగే పండగే మన ఊరంతా 
పండగే
పండగే పండగే మన వాడంత పండగే 
పండగే పండగే మన పళ్ళెంత పండగే 
పండగే పండగే మన బ్రతుకులో పండగే (2)

పాపపు ముల్లును విరచుటకు 
పాపిని పవిత్రపరుచుటకు (2)
నిత్యానందము నిచ్చుటకు
నిత్య రాజ్యంలో చేర్చుటకు (2)
ఈ లోకానికి వచ్చాడయ్యా బ్రతుకులొ పండగ తెచ్చాడయ్యా (2) 
||పండగే పండగే||

వాగ్దానము నెరవేర్చుటకు 
వారసులుగా చేయుటకు (2)
బంధకాలను తెంచుటకు 
భయములన్నీ పోగొట్టుటకు (2)
ఈ లోకానికి వచ్చాడయ్యా బ్రతుకుల పండగ తెచ్చాడయ్యా
(2)
||పండగే పండగే||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments