3791) ఓ....మానవా ప్రభుయేసు జన్మించెన్ మనకిలలో ఆనందం


** TELUGU LYRICS **

ఓ..... మానవా ప్రభుయేసు జన్మించెన్ 
మనకిలలో ఆనందం రక్షణయే కలిగెనులే 
రక్షణయే కలిగెనులే 

ఆ బాలుని జననంబును చాటిరి దూతలు ఇలలో 
శ్రీయేసుని ప్రార్ధింపగా రారండి  ఓ.....లోకమా (2)
కలలు పండే కనులవిందై 
వెలుగు నిండే ప్రతి హృదయములో (2) 
|| ఓ..... మానవా|| 

ఆకాశంబున తార దారి చూపగా దర్శించిరి జ్ఞానులేసుని 
బంగారమును సాంబ్రాణి బోళమున్ అర్పించి ఆడి పాడిరి (2)
జ్ఞానులు వచ్చి ఆ కానుకలిచ్చి 
పూజించిరి ప్రభుయేసుని (2) 
|| ఓ..... మానవా|| 

ఈనాటితో ఈభాదలు పోయెను ఓ లోకమా.. 
శ్రీయేసుని రాజ్యమ్ములో దొరుకును నిత్యజీవము (2)
పాటలతోను నాట్యముతోను 
కొనియాడుము ఆ దేవుని (2) 
|| ఓ..... మానవా|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------