3790) నీ నీడలో నన్ను నిలువనీ నీ గానమే బ్రతుకంతా పాడనీ

    

** TELUGU LYRICS **

    నీ నీడలో నన్ను నిలువనీ 
    నీ గానమే బ్రతుకంతా పాడనీ (2)
    ఓ పవిత్రుడా  మేరీ తనూజుడా (2)
    మానవ జాతి రక్షణకై 
దివి నుండి వచ్చావా (2) 
    నీ నీడలో నన్ను నిలువనీ నీ గానమే బ్రతుకంతా పాడనీ
    పాడండి పాడండి పాట నోరారా
    పాడండి పాడండి పాడండి పాడండి 
పాట నోరురా ఊరూరా 
    ||నీ నీడలో||

1.  దేవుడు మనిషిగా జన్మించెను ఈ లోకమందున
    యావే దేవుడు పంపిన ఈ పరిశుద్ధుని ఆగమనం (2)
    స్వరమే వరమై మంగళకరమై (2)
    సరిగమ రిగమప గమపద మపదని (2)
    పాడండి పాడండి పాట హ్యాపీ క్రిస్మస్
    పాడండి పాడండి పాడండి పాడండి పాట 
    మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ||నీ నీడలో||
    ||నీ నీడలో||

2.  నిన్నెడబాయడు దైవ కుమారుడు 
    ప్రేమోన్నతుడు మన ప్రభువు (2)
    విశ్వాస నిరీక్షణతో వేడిన 
దొరకును దేవుని పుణ్యఫలం (2)
    ఆరాదింతుము ఆద్యుని సన్నిధి ఆరాధన.. ఆరాధన.. ఆరాధన..
    సరిగమ రిగమప గమపద మపదని (2)
    పాడండి పాడండి పాట హ్యాపీ క్రిస్మస్
    పాడండి పాడండి పాడండి పాడండి పాట 
    మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
    ||నీ నీడలో||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------