3789) దేవలోక మహిమనంతా భుమిపైకి తెచ్చాడు


** TELUGU LYRICS **

దేవలోక మహిమనంతా భుమిపైకి తెచ్చాడు 
దీనురాలి కడుపునుండి యేసు ఉదయించాడు 
మనుజాలిపై ప్రేమతో దేవదేవుడు 
నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు
కలిగెను విడుదల సంతస క్రిస్మస్ 
వెలిగిన మనసుల సంబర క్రిస్మస్  
||దేవలోక|| 

చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి 
ఎప్పుడు మనతోడై నడిపిస్తాడు (2)
కీడు ఏది రాకుండా దీవెనలు పోకుండా (2)
కంటిపాపల కాచి భద్రం చేసే ప్రాణప్రియుడు 
||కలిగెను|| || దేవలోక|| 

పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను బాపి 
ఎప్పుడూ మన మధ్యే నివసిస్తాడు (2)
లోటు చూడనీకుండా ఆటంకాలు లేకుండా (2)
అన్నింటిని సమకూర్చి సాయం చేసే ప్రాణప్రియుడు
||కలిగెను|| || దేవలోక|| 

వేదనను మాయం చేసి గుండెలోని బాధను మాన్పి 
ఎప్పుడు మనతోనే పయనిస్తాడు (2)
శత్రుబారి పడకుండా ఆశయాలు చెడకుండా (2)
చుట్టూ కేడమైయుండి కార్యం చేసే ప్రాణప్రియుడు
||కలిగెను|| || దేవలోక|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------