3760) ఇంటింటా సంబరం ఊరంతా సందడి


** TELUGU LYRICS **

ఇంటింటా సంబరం ఊరంతా సందడి 
పరలోకం పరవసించెనే యేసయ్యా పుట్టాడని 
పాపికి విడుదలని 
చీకటి తొలగిందని ఆహా.. 
విజయం మనదేనని  (2)

బెత్లెహేము నజరేతులో 
భయముతో కాపరులు దిగులుతో ఉన్నారు 
శుభవార్తను దూత తెచ్చెన్ 
భయపడకుడి రక్షకుడు జన్మించాడని 
దిగులు భయముతో ఉన్నావా నేడు 
నీకై రక్షకుడు జన్మించే చూడు (2)

ఆ నిశీధిలో జాలి వెన్నెలలో 
 చలి గాలుల్లోన పాశుల పాకలోన  
క్రీస్తు ఉదయించే హృదయాలలో   
||ఇంటింటా|| 

అవమానంతో కష్టాలలో కన్నీళ్లల్లో 
యేసయ్యకు జన్మనిచ్చే మరియమ్మ తల్లి 
ఓ.. ఈనాడు నీ నిందకు ప్రతిగా 
ఆనందం తెచ్చెను యేసయ్య జన్మం 
లేచి గంతులు వేయి సోదరా 
హ్యాపీ క్రిస్మస్ నేను సోదరి (2)
||ఇంటింటా|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------