3809) దేవుడే మహిమ విడచి భువిపై మనకై వెలిసే

    

    ** TELUGU LYRICS **

    దేవుడే మహిమ విడచి
    భువిపై మనకై వెలిసే
    ఇమ్మానుయేలుగా - మన తోడు ఉండుటకై
    తన కిష్టులైన ప్రజకు - సమాధానం ఇచ్చుటకు
    క్రిస్మస్ ఆనందం - తెచ్చే సంతోషం
    ప్రతి హృదయంలో - రక్షణానందం (2)

1.  దూతలే - పాడిరి - సర్వోన్నత మైన స్థలములలో
    దేవునికి - మహిమ - భువిపై సమాధానము (2)
    గొల్లలే గంతులేసి - జ్ఞానులు శిరసు వంచి - ఆరాధించిరి
    హృదయాలు తెరచి - మనసారా పాడేదం - 
    ఏసురాజు వచ్చెనని 
    ||క్రిస్మస్ ఆనందం||

2.  వాక్యమే రూపమై - మన మధ్యలో - నివాసముండెను
    పాపికి రక్షణ క్షమాపణ - ఇచ్చుటకు (2)
    తండ్రితో - కోల్పోయిన - స్నేహము దొరికెను - ఈ దినమే
    పశుశాలలో పవళించెను - ప్రేమతో నిను చేరుటకే
 
    ||క్రిస్మస్ ఆనందం||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------