3807) బెత్లహేము పురములో ఆ పశువుల పాకలో పుట్టనే మారాజు దీనుడుగా రారాజు


** TELUGU LYRICS **

బెత్లహేము పురములో ఆ పశువుల పాకలో 
పుట్టనే మారాజు దీనుడుగా రారాజు 
రారండి కొలిచెదం ఆ సృష్టికర్తను 
రారండి చాటెదం శుభవార్తను సర్వజనులకు
బెత్లహేము పురములో ఆ పశువుల పాకలో 
సంబరమే మదిలో యేసు పుట్టెనుగా 
అంబరమే తాకే సంబరమీవేళ 
అందరమూ చేసే పండుగ ఈవేళ ఓ ఓ ఓ ..... 

ఆదిలో వాక్యమే దేవుడైయుండే 
ఆ దేవుడే బాలుడై మనుజుడైయుండే 
పరలోకము పండుగై ఆకాశము నిండుగా 
శురసైన్యమే ప్రభువుకు మహిమను పాడిందే 
జగమున కలిగినదంతయు 
పులకించెనే  ప్రభుని జన్మకు 
పరమున దూత సైన్యము 
తిలకించెనే కొనియాడిరే 
నరునిగా మారిన దేవుని చూడగానే 
సంబరమే మదిలో యేసు పుట్టెనుగా 
అంబరమే తాకే సంబరమీవేళ 
అందరమూ చేసే పండుగ ఈవేళ ఓ ఓ ఓ ..... 

దూతలు తెలిపిరి ఆ రాతిరి గొల్లలకు 
మీ కోసమే రక్షకుడు పుట్టెనని 
తూరుపు తారను చూచిరి జ్ఞానులు 
వెడలిరి కొలిచిరి ప్రభుయేసుని 
బోళము బంగారము సాంబ్రాణియు అర్పించిరి 
చీకటి రాజులే జడిసిరి బీతిల్లిరి 
చిరకాలము ఏలెడి రాజు పుట్టెనని 
సంబరమే మదిలో యేసు పుట్టెనుగా 
అంబరమే తాకే సంబరమీవేళ 
అందరమూ చేసే పండుగ ఈవేళ ఓ ఓ ఓ...


-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------