3754) ఉదయించినాడు చూడు నేస్తమా లోక రక్షకుడు క్రీస్తేసుగా


** TELUGU LYRICS **

ఉదయించినాడు చూడు నేస్తమా
లోక రక్షకుడు క్రీస్తేసుగా (2)

సర్వాధికారి ఆయెనే సర్వశక్తిమంతుడు
దీనుడై రిక్తుడై మనుష్యకుమారుడై  (2)
నశియించినదానిని వెదకి రక్షించుట కొరకు వచ్చెను (2)
లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా  

ఇమ్మానుయేలు దేవుడు ఎన్నడూ నిను విడువడు
మరువడు కునుకడు తోడుగా ఉండువాడు (2)
నలిగినవారికి  దుర్గమై ఆశ్రయమిచ్చే అమరుడు (2)
చీకటి బ్రతుకులో వెలుగునింపుటకు నీతి సూర్యుడై 

ప్రయాసపడుచు భారము మోయు సమస్త జనులరా
రండి దేవుని ఆశ్రయించుడి ఈ దినమందే  (2)
మీ దోషములు అపరాధములు అన్నీ పోవును (2)
శాంతి నెమ్మది సమాధానము ఇచ్చే దయగల దేవుడు

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments