3719) సర్వోన్నతుడా సర్వేశ్వరుడా సంపూర్ణుడా సత్యస్వరూపి

    

** TELUGU LYRICS **

    సర్వోన్నతుడా, సర్వేశ్వరుడా, సంపూర్ణుడా సత్యస్వరూపి 
    సర్వమానవాళి కొరకై సత్యసువార్త ప్రకటించి 
    సర్వోన్నత స్థలములలో మనలను చేర్చుకొనుటకు 
    దివినుంచి వచ్చిన మా యేసయ్యా
    అహ ఆనందమే పరమ సంతోషమే 
    నా యేసు నాకై పుట్టెను 
    ||సర్వోన్నతుడా||

1.  పరలోక దూతలు ఇహలోక నరులకు 
    ప్రకటించిరి మహా సంతోష శుభవార్తను 
    రానున్న యేసయ్యా  మన మెస్సయ్యని 
    మా ఇమ్మానుయేలు దేవుడని గళమెత్తి ఆరాధింతును 
    ||అహ ఆనందమే||

2.  రాజా భవనం కాదురా జనియించిన మన రాజు 
    పశువుల పాకార ఆ దైవ కుమారుడు వెలసినది 
    బంగారు ఉయ్యాలా కాదురా పరుండినది 
    పశువుల తొట్టిరా రక్షకుడు నిదురించెను
    ||అహ ఆనందమే||

3.  పట్టు వస్త్రములు కాదురా ధరియించెను ఆ దైవం 
    పొత్తి గుడ్డలతో చుట్టబడెను ప్రియా యేసు 
    రాజకుమారుడిగా కాదురా ఆ ప్రభువు పయనమూ
    యూదుల రాజుగా సాగింది ఆ సిలువ త్యాగము
    ||అహ ఆనందమే||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------