** TELUGU LYRICS **
రాజులకు రాజు
ప్రభువులకు ప్రభువు
రక్షకునిగ అరుదెంచిన రోజు
మహోన్నతుడు సర్వశక్తుడు
పుడమిపై పుట్టిన రోజు (2)
అ.ప: అదే అదే క్రిస్మస్ రోజు (2)
||రాజులకు రాజు||
ప్రభువులకు ప్రభువు
రక్షకునిగ అరుదెంచిన రోజు
మహోన్నతుడు సర్వశక్తుడు
పుడమిపై పుట్టిన రోజు (2)
అ.ప: అదే అదే క్రిస్మస్ రోజు (2)
||రాజులకు రాజు||
1. విశ్వమంత ఏలేటి రారాజుకు
తలవాల్చుటకు
చోటు లేకుండెను (2)
బెత్లెహేములో పసుల తొట్టిలో
రక్షకుడేసు పవళించెను (2)
" అదే అదే క్రిస్మస్ రోజు "
||రాజులకు రాజు||
2. తూర్పుదేశ జ్ఞానులు
ప్రభువును గాంచ
తారను చూసి పయనించిరి (2)
బంగారము,సాంబ్రాణి,
బోళములను కానుకగ
అర్పించిరి (2)
" అదే అదే క్రిస్మస్ రోజు "
||రాజులకు రాజు||
3. గొర్రెలను కాయుచున్న కాపరులకు
దేవదూత శుభవార్త అందించెను (2)
వేగిరమే ప్రభువు చెంత కేతెంచి
స్తోత్రములు ఆయనకు చెల్లించిరి (2)
""అదే అదే క్రిస్మస్ రోజు "
||రాజులకు రాజు||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------