** TELUGU LYRICS **
నక్షత్రం ఉదయించెను యాకోబులో
రాజదండము లేచెను ఇశ్రాయేలులో (2)
స్వల్పమైన బేత్లేహేము ఎప్రాతా నుండి
లోకాన్ని ఏలువాడు ఏతెంచేను (2)
రాజదండము లేచెను ఇశ్రాయేలులో (2)
స్వల్పమైన బేత్లేహేము ఎప్రాతా నుండి
లోకాన్ని ఏలువాడు ఏతెంచేను (2)
1. మనుష్యుని పోలికగా జన్మించి
దాసుని రూపం దాల్చుకున్నాడు
తన్ను తానే రిక్తునిగా చేసుకొని
కల్వరి సిలువలో మరణించాడు (2)
మృత్యుంజయుడై - తిరిగి లేచాడు (2)
పరలోక రాజ్యానికి - దారి చూపాడు (2)
2. పాపం బాపెను శాపం బాపెను
దుఃఖమంతా తొలగించెను
శాంతి సమాధానం లోకానికి ఇచ్చెను
నీతి రాజ్యం స్థాపించెను (2)
కరుణించే యేసయ్య - జీవమిచ్చే యేసయ్య (2)
మనిషిగా జన్మించి - రక్షనిచ్చాడు (2)
3. పాపాలొప్పుకొని యేసుని నమ్మితే
పరిశుద్దినిగా మార్చివేస్తాడు
నిత్య నరకాగ్ని నుండి తప్పించి
నిత్య రాజ్యం చేరుస్తాడు (2)
యేసయ్యే మార్గం - యేసయ్యే సత్యం (2)
యేసయ్యే జీవం - యేసయ్యే ద్వారం (2)
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------