3726) సంబరమే సంబరమే సంబరమంట క్రిస్మస్ పండగంటే సంబరమంట



** TELUGU LYRICS **

సంబరమే సంబరమే సంబరమంట
క్రిస్మస్ పండగంటే సంబరమంట
ఊరు వాడ చెయ్యాలి సంబరాలట
రక్షకుడు పుట్టాడని సంబరాలట

దావీదు పట్టణాన సంబరమంట
పశువుల పాకలోన సంబరమంట
గొల్లలేమో చేశారు సంబరాలట
దూతలేమో పాడారు స్తోత్రాలంట

ఆశ్చర్యకరుడుగా వచ్చాడంట
ఆలోచనకర్తగా ఉన్నాడంట
నశియించేవారిని రక్షించుటకు
ఇమ్మానుయేలుగా వచ్చాడంట

పాపుల రక్షకుడు పుట్టాడంట
పాపాంధకారము పోయిందంట
అందుకే చెయ్యాలి సంబరాలట
యేసయ్యను చాటాలి లోకమంతట

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------