** TELUGU LYRICS **
రాజులకు రాజు రారాజు యేసు పశుల పాకలో పుట్టినాడురా
మన పాపమెల్ల బాపి శాపమంత కడిగి పావనము చేయవచ్చెరా
ఆ దివిని వీడి ఈ భువికి ఏగి నింగి నేలను కలుప మనుజావతారమెత్తెరా
చిందులేసి గంతులేయరా ఇంక చీకటింక వదిలేయరా
మన రక్షకుడుదయించెరా మన బ్రతుకులన్ని మరిపోయెరా
అనంతుడు ఉదయించే నేడు అంధకారం తొలగివెలిగెను పేద గుండెల్లోనా పండుగే
రాజాధి రాజు వెలసెనంట భూమిపై ప్రజా సందడి
లోక రక్షకుడు పుట్టెనంట భూమిపై ప్రజా సందడి
శాంతి సౌభాగ్యాల వెల్లువ ప్రతి ఇంట పండెనంట
యుగయుగాలకు దైవం యేసు తరతరాలకు జీవన జ్యోతి కరుణామూర్తి పుట్టెనంట
మన కన్నుల్లోన వెలుగు సందడి నిత్య రాజ్యం ఇస్తాడంట
మన గుండెల్లోన రక్షణ సందడి ఊరి వాడ ఆనంద కెరటం
ఉప్పొంగి పారెను ఏరులా ఈ సమయాన

-------------------------------------------------------------------
CREDITS :