3741) లాలీ లాలీ యేసువా లాలీ వరమేరీ తనయుండా లాలీ

    

** TELUGU LYRICS **

    లాలీ లాలీ యేసువా లాలీ 
    వరమేరీ తనయుండా లాలీ సుకుమార యేసువా లాలీ (2) 

1.  పశు పాకయే నీకు పాన్పాయేగదా (2)
    భూలోకమందు జోలాయే గదా 
    పశుకాలమే నీకు ఇంపాయ గదా (2)
    సుకుమార యేసువా లాలీ (4)

2.  చుక్కాను జూచారు మార్గంబు చూడ (2)
    జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి 
    ఇచ్చారు కానుకలు మనసారా చూసి (2)
    సుకుమార యేసువా లాలీ (4)

3.  గొల్లలు చూశారు వెర్రిగ ఇలలో (2)
    ఇచ్చారు ప్రేమతో గొర్రెను భువిలో 
    మురిచారు నిన్ను చూసి ఆనందముతో (2)
    సుకుమార యేసువా లారీ (4)

4.  రాజుల మించిన రాజువు నీవె (2)
    బాలలో ప్రియమైన బాలుడు నీవె 
    మా పాపం తొలగించ వచ్చావా (2)
    సుకుమార యేసువా లాలీ (4) 

5.  దూతలు పాడారు పరలోకమందు (2)
    స్తుతిగీతములతో పొగిడారు అందు 
    జగమందు మాకొక ప్రియమైన విందు (2)
    సుకుమార యేసువా లాలీ (4)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------