3675) ఏమివ్వగలను నా జీవితాన నే ఘోర పాపిని యేసూ


** TELUGU LYRICS **

ఏమివ్వగలను నా జీవితాన నే ఘోర పాపిని యేసూ..
పలుమార్లు నీ గాయము రేపి  నిన్నెంతో శిక్షించినానో... 
నన్నెంతో ప్రేమించినావో...నన్నెంతో రక్షించినావో... 

కలువరిలోనాకై శ్రమ నొందినావు 
నీ హృదిని ధారపోసినావు  
నీ ప్రేమతో నీ జాలితో 
నీ కరుణతో నీ వాత్సల్యముతో 
నన్ను పరిశుద్ధపరిచ శ్రమ పొందితివా 
నన్ను పరమును చేర్చ బలిఐతివా 

నా  పాపభారం నీవు మోసినావు 
ఆ క్రూర శ్రమలు పొందినావు
నీ త్యాగంతో నీ యాగంతో 
నీ సంకల్పంతో నీ సిలువశక్తితో
నన్ను నీ సొత్తుగా ఏర్పరచితివి 
నన్ను నీ బిడ్డగా బలపరచితివి 

కన్నీటి వ్యధలను విడిపించినావు
నరకపు సంకెళ్లు తెంచినావు 
నీ సహనంతో నీ సాత్వీకంతో
నీ ఓర్పుతో నీ బలియాగంతో
నా నరకపుయాతనలను విడిపించితివి 
నిత్యజీవపు రాజ్యం నాకొసగితివి  

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------