3637) తరతరములకు యుగయుగములకు నీవే దేవుడవు

** TELUGU LYRICS ** 

    తరతరములకు యుగయుగములకు నీవే దేవుడవు 
    తరగని కృపతో నీతనయునిగా మార్చిన నాధుడవు 
    కనికరపడుచు కరములు చాపి కౌగిలినిచ్చెదవు 
    కన్నవారిని మించిన ప్రేమ చూపిన దేవుడవు 
    నీకే నీకే ఆరాధన - యేసు నీకే ఆరాధన 

1)  నిన్న నేడు మారనివాడవు నీవే యేసయ్య 
    ఎన్నటెన్నటికి ఏకరీతిగా వుండేవాడవయా 
    ఊహలకందని ఉన్నతుడా
    ఉన్నతస్థలములలో ఘనుడ 
    ఉండువాడవు అన్ని వేళల నేవే యేసయ్య 
    నీకే నీకే ఆరాధన 
    యేసు నీకే ఆరాధన

2)  ఎంత చెప్పిన తరగని ప్రేమ నీదే యేసయ్య
    చెంత చేరి చింతలు బాపే దేవుడ నీవయ్యా
    బండగా నడిచిన దేవుడా 
    అండగ నిలిచిన యేసయ్య 
    ఎండ వేళలో దాహము తీర్చే ఊటవు నేవేగా 
    నీకే నీకే ఆరాధన 
    యేసు నీకే ఆరాధన

3)  బాహుబలముతో బంధకములను తెంచినవాడవయ్యా
    బలహీనతలో కృపతో నింపే ఘనుడవు నీవయ్యా 
    అందరి దేవుడ నీవయ్యా 
    అందరికి ఉపకారివయ 
    అందరి కొరకు మరణం పొంది లేచినవాడవయా 
    నీకే నీకే ఆరాధన
    యేసు నీకే ఆరాధన

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------