3638) గాయపడినపుడు నీ నామమే ఉపశమనం

** TELUGU LYRICS **

    గాయపడినపుడు నీ నామమే ఉపశమనం
    బాధపడినపుడు నీ హస్తమే అభయం(2)      
    సూర్య చంద్రులను తలదన్నే కాంతి పుంజమా
    సర్వ సృష్టిని సృజియించిన రక్షణ శృంగమా (2)
    హల్లెలుయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య (2) 
    ||గాయపడినపుడు|| 

1.  నా జీవితమంతయూ నీ సాక్షిగా నిలిచెదన్ 
    నీ జీవ వాక్యమును ప్రకటించెదన్(2)
    వర్ణింపదగుదున నీ ఘనచరితను
    వరింపదగుదున నీ ప్రేమ హృదయమున్ (2) 
    ||హల్లెలుయ్య|| 

2.  నా క్రియలను దిద్దుచు నా పాపము కడుగుచు
    నా కోసమే నీవు బలియైతివి (2)
    బంగారు కంటెను అపరంజి కంటెను  
    నీ అజ్ఞాలే నాకు ప్రియముగా నున్నవి (2)
    ||హల్లెలుయ్య|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------