** TELUGU LYRICS **
ఒకమాట చాలు తండ్రీ నీ చల్లనైన నోట
నా జన్మ తరియించును నా ఆశ ఫలియించును
నా జన్మ తరియించును నా ఆశ ఫలియించును
1. మమతలు పంచే లోకంలో మంచికి కరువైపోయింది
ప్రేమను పంచే హృదయంలో ద్వేషం గూడులు వేసింది
అట్టి హృదయాలను ముట్టి మార్చాలని
నిత్యము సాక్షిగా నీకై నిలవాలని
ప్రేమను పంచే హృదయంలో ద్వేషం గూడులు వేసింది
అట్టి హృదయాలను ముట్టి మార్చాలని
నిత్యము సాక్షిగా నీకై నిలవాలని
2. లోకంలో నీ ప్రజలంతా నీ ప్రేమను గుర్తించాలి
నిను ద్వేషించే వారంతా రక్షణలోనికి రావాలి
అందరం ఏకమై నిన్ను కొలవాలని
శుద్ధ హృదయాలతో నిన్ను చేరాలని
నిను ద్వేషించే వారంతా రక్షణలోనికి రావాలి
అందరం ఏకమై నిన్ను కొలవాలని
శుద్ధ హృదయాలతో నిన్ను చేరాలని
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------