** TELUGU LYRICS **
నీ నీడలో నన్ను దాచుము
నీ జాడలో సాగిపోదును (2)
చేదోడు వాదోడు నీవెగా
పాదాల దరిచేరితి యేసయ్య (2)
నీదాపు చేరిన మరణంబు లేదయా
ఆధారం నీవే నా యేసయ్య (2)
ఆధారం నీవే నా యేసయ్య (2)
||నీ నీడలో||
1. గాయాలు చాలాయె కడుగుము దేవా
ఆయాసము తీయు నీ రక్తము (2)
నా యాత్రలో నీవె నా సారధి
నా యాత్మ నీ యందే హర్షించును (2)
||నీ నీడలో||
2. నే పూలమొక్కను నీ కాంతి కిరణం
నాలోన పడని నె వికసింతును (2)
భులోకమందున పుష్పించి నిలుతు
వేలాది (సు)వాసనలు వెదజల్లుదూ (2)
||నీ నీడలో||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------