3605) నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు విడువని దేవుడు నా దేవుడు

** TELUGU LYRICS **

నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు
విడువని దేవుడు నా దేవుడు 
అబ్రాహామును పిలిచిన వాడు 
ఇస్సాకును ఇచ్చిన వాడు  
యాకోబును మార్చిన వాడు నాదేవుడు 
నాదేవుడు యేసు నా దేవుడు 
||నిన్న నేడు||

దావీదు చేసిన స్తుతులను అంగీకరించెను 
ఈనాడు నాస్తుతి బలులపై ఆసీనుడాయెను 
నాప్రాణ ప్రాణుడు నా యేసు దేవుడు 
అన్నివేళలా నాకు తోడై ఉండును
||నిన్న నేడు||

హన్నా చేసిన ప్రార్ధన అంగీకరించెను 
ఈనాడు నా మనవులకు సమాధానమిచ్చెను 
వాగ్ధానపూర్ణుడు నా యేసు దేవుడు 
ఎల్ల వేళలా నాకు తోడై ఉండును
||నిన్న నేడు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------