** TELUGU LYRICS **
కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం ఘనమైన కార్యం
దేవుడు సంకల్పించిన ప్రక్రియ
మానవాళి మేలుకై చేసిన సత్క్రియ
ఆ: ప: కళ్యాణం పరిశుద్ధ కార్యం
రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం
1. ఒంటరైన జీవితం మంచిది కాదని
సాటియైన సహాయం ఉండుట మేలని
నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి
స్త్రీనిగ చేసెను పురుషునితో కలిపెను
2. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని
కడవరకు జంటగా కలిసి యుండాలని
ఫలియించి ధరలో వ్యాపించాలని
యిల జతపరచెను భార్యభర్తలనెను
3. కడపటి పెండ్లిలో వధువుగ నిలవాలని
పరిశుద్ధ కన్యకలా సిద్ధపడి యుండాలని
వధువైన సంఘమును వరుడేసు కోరెను
పరిణయమాడను వేగమే రానుండెను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------