1263) ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి బండమీద తాను బండమీద

** TELUGU LYRICS **

ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి (2)
బండమీద తాను బండమీద
ఇల్లు కట్ట నిశ్చయించె వివేకి 
గాలి వీచెను వాన కురిసెను 
వరదలొచ్చి దానిమీద దాడి చేసెను  (2)
బండమీద పునాది వేయబడెను - వివేకి ఇల్లు నిలబడెను 
వివేకమైన తన పనిచేత - సంతోషంగానుండెను (2)

ఇల్లు కట్ట నిశ్చయించె అవివేకి (2)
తాను ఇసుక మీద తాను ఇసుక మీద
ఇల్లు కట్ట నిశ్చయించె అవివేకి 
గాలి వీచెను వాన కురిసెను - వరదలొచ్చి దానిమీద దాడి చేసెను (2)
ఇసుక మీద పునాది వేయబడెను - తుఫానుచేత కొట్టబడెను 
అజ్ఞానమైన తన పనిచేత - ఇల్లు నేల కూలిపోయెను

క్రీస్తను బండపైన ఇల్లకట్టిన
అది కూలదు నేల వాలదు
నిత్య జీవము కొరకై స్థిరమగును (2)
కష్టమొచ్చినా నష్టమొచ్చినా 
వ్యాధులొచ్చినా ఎన్ని బాధలోచ్చినా (2)
క్రీస్తను బండపైన ఇల్లు కట్టెదం 
మదిలో క్రీస్తును నిలిపెదము 
వివేకమైన ఈ పనిచేత 
పరలోకం చేరుకొందము (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments