2770) యేసుని యందలి ఆనందమే మాకు బలము

** TELUGU LYRICS **

    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము
    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము
    పరిస్తితుల వైపు చూడము మేము మా ప్రభుని వైపే చూస్తున్నాము
    పరిస్తితుల వైపు చూడము మేము ఊ మా ప్రభుని వైపే చూస్తున్నాము
    ఈ ఈ తుఫానుకు ఎంతెంతో పైన కూర్చొని యున్నాం మేం మేం పరలోకాన
    ఫలితం మేమెపుడో చూచాం కదన్నా అత్యధిక విజయమన్నా
    మధ్యలో ఏమైతే మాకెందుకన్నా చివరికి గెలిచేది మనమే కద అంట
    ఎంతటి శ్రమయైన దాన్నెంతో మించిన అత్యధిక మహిమ అట
    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

1.  శ్రమయే వచ్చిందా దానిని మించేటి అద్భుతము చేస్తాడు నీ దేవుడు (2)
    మునుపే లేనట్టి ఊహకు మించేటి భీకర క్రియలను చూపిస్తాడు
 (2)
    ఐదుగురు రాజులు అడ్డంగా తెగబడి
 (2)
    ఉక్కిరిబిక్కిరి చేద్దామని జిత్తులమారి వ్యూహాలకు యెహోషువా పైకి దండెత్తగా
    సూర్య చంద్రులను ప్రభు నిలిపేనే పోరు జరుపుటకు వెలుగిచ్చెనే
    వెలుగు క్రింద చీకటే నశియించెనే నిలువలేక పారిపోయి హతమాయెనే
 (2)
    సోర్యుణ్ణె ఆపిన ఆ గొప్ప దేవుడు నిన్ను కాపాడలేడా
    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

2.  దేవుడు ఆలస్యం చేస్తున్నాడనుకోకు అందులోనే గొప్ప మేలు దాగుందిగా
 (2)
    కొంచం సహించి నమ్మిక యుంచావ ప్రభుని మహిమ జనమంతా చూస్తారుగా
 (2)
    మార్త మరియమ్మల లాజరు నిద్రించగా
 (2)
    అంత్యదినము లేస్తాడని ఇప్పుడు అసాధ్యం అని సమాధి చేశారు బహు ఏడ్చుచు
    నాల్గు దినములకు ప్రభువొచ్చెనే లాజరు బయటకు రా.. అనెనే
    మృతుడైన లాజరు బ్రతికొచ్చెనే జనమంతా ప్రభుని నమ్మి మహిమపరచెనే
 (2)
    రోగిగా ఉన్నపుడే స్వస్థతను పొంది ఉంటే ఈ సాక్ష్యం అసలుంటుందా
    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

3.  ఎంతో ఎత్తైన కొండే అడ్డుందా భయమొద్దు అది ఉంది నీ మహిమకై
 (2)
    నాకే ఎందుకిలా అవుతుందనుకోకు ప్రభు వనుమతిచ్చాడు నీ గొప్పకై
 (2)
    దావీదు మహిమకై గోల్యాతు వచ్చెనే
 (2)
    అందరును జడిసినను దైవాత్మ ప్రేరణతో దావీదు యుద్ధంలో వెలుగొందెనే
    శత్రు గొల్యాతును పడగొట్టెనే వెలుగు దావీడుకి ఘనతిచ్చెనే
    దావీదు పదివేల మందిని అంటూ జనుల చేత గానాలె చెయించెనే 
 (2)
    దావీదుకు తోడుండి ఘనపరిచిన ఆ దేవుడు నిన్ను హెచ్చించలెడా
    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

4.  యుద్ధం లేకుండా విజయం ఉంటుందా యుద్ధమొస్తె చేసేయి స్తుతుల ధ్వని 
 (2)
    భీకర సైన్యాలే నీపై కొస్తుంటే కొల్ల సొమ్ము నీకు ఎదురు వస్తోందని
 (2)
    యెహొషాపాతు పై ఆ ముగ్గురు రాజులు
 (2)
    యుధానికి వచ్చినప్పుడు యుధ్ధమంత చేసింది తన ప్రజల పక్షమున ప్రభువే కదా
    శత్రు గణమంతా సమాప్తము కొల్ల సొమ్మెంతో విస్తారము
    కూర్చుటకు పట్టెనే మూడు దినములు ... యుద్ధ ధ్వనులు అయ్యాయే విజపు ధ్వనులు 
 (2)
    బెరాక లోయలోన స్తుతి ఆశీర్వాదాలు ఉప్పొంగును కృతఙ్ఞతలు
    యేసుని యందలి ఆనందమే మాకు బలము
    యేసుని యందలి విశ్వాసమే మాకు జయము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------