2769) యేసుని భజియింపవే మనసా నీ దోసములు

** TELUGU LYRICS **

    యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ
    బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని
    దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని 
    ||యేసు||

1.  ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు
    వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి
    రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు
    ||యేసు||

2.  ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు
    నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని
    నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును
    ||యేసు||

3.  లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు
    ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను
    నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును
    ||యేసు||

4.  వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని
    సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ
    నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా
    ||యేసు||

5.  నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ
    డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను
    విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------