2776) యేసుని వెంట నేను వెంబడించుచున్నాను

** TELUGU LYRICS **

    యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను (1)
    నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను (1)
    అను పల్లవి: తన హృదయానుసారునిగా
    ఉండుటకు సిద్ధపడుచున్నాను

1.  ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2)
    సాదృశ్యముగ నా కొరకై
    ప్రాణమర్పించెను - ప్రాణమర్పించెను
    నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2)

2.  ఈ లోక సౌదర్యము - నన్ను మోసగించదు
    సాతాను యుక్తులన్నియు
    నా మీద పనిచేయవు - నా మీద పనిచేయవు
    యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను

3.  ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట
    ప్రభు నన్ను సరిచేయుట
    తన ప్రేమయై యున్నది - తన ప్రేమయై యున్నది
    యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను

4.  ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే
    శ్రమలే మాత్రము కదల్చవు
    అద్దరి అగుపడుచున్నది - అద్దరి అగుపడుచున్నది
    శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను

5.  తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును
    మంచి మాటలన్నియు నేర్పి
    నను సిద్ధపరచుచున్నాడు - నను సిద్ధపరచుచున్నాడు
    మహిమను పొందుటకు నేను – వెంబడించుచున్నాను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------