2758) యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో

** TELUGU LYRICS **

    యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
    నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు

1.  ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు
    ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు

2.  లేబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు
    ప్రభు కృపాజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు

3.  యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు
    సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు

4.  దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరు
    సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు

5.  వారు ముసలితనంబున - చిగురు పెట్టి ఫలింతురు
    ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు

6.  నీటి కాలువ యోరను - నాటబడిన వారలై
    మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు

7.  హల్లేలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు
    చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------