2598) యేసు నామమునే పాపికి రక్షణ

** TELUGU LYRICS ** 

    యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)
    అను పల్లవి: ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)

1.  ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్
    మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్

2.  పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప
    దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్

3.  పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్
    మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే

4.  పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో
    ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------