2710) యెహోవ మన కొరకు గొప్ప కార్యములను

** TELUGU LYRICS **

    యెహోవ మన కొరకు - గొప్ప కార్యములను
    జేసెనని మనము ఆనందించెదము

1.  ఆయన యేర్పరచిన దినమిది - అగుపడె మనకు ఆశ్చర్యముగా
    దీనియందు మనముత్సహించి - సంతోషించెద మెపుడు

2.  తన సేవకులు మొరపెట్టగానే - కనుపరచెను ప్రభువు ఈ స్థలమును
    మన మెల్లరమును యేకముగా - కూడి - మహిమను చాటెదము

3.  యాకోబులో ప్రభు యే దోషమును - ఇశ్రాయేలులో యే వంకరతనమున్
    కనుగొనలేదే ప్రభు యెహోవా - తనకే స్తుతి చెల్లింతము

4.  క్రీస్తే మనకు మూలరాయైయుండ - ప్రవక్తలు వేసిరి ఆ పునాది
    దానిమీద కట్టబడితిమి మనము తన రక్షణ ప్రకటింతము

5.  ప్రతి కట్టడమును ఆయనలోనే - పదిలముగా నమర్చబడినదై
    అతిసుందరంబైన గృహముగా - స్తుతియించి సేవింతుము

6.  మన ప్రభువైన క్రీస్తేసునందు - పరిశుద్ధ ఆలయముగ మనము
    నిర్మింపబడితిమి ఈ భువియందు - సాగిలపడి మ్రొక్కెదము

7.  ఘనదేవా నీవే సమస్తమును - బాగుగాను చేసితి వనుచు
    స్తుతి మహిమ ప్రభావములు - నీకే హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------