3051) వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ

** TELUGU LYRICS **

    వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల
    కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద 
    ||వినరయ్య||

1.  పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన
    దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్ 
    ||వినరయ్య||

2.  భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు
    దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్ 
    ||వినరయ్య||

3.  అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు
    మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్ 
    ||వినరయ్య||

4.  మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన
    పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ 
    ||వినరయ్య||

5.  తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో
    ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్
    ||వినరయ్య||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------