** TELUGU LYRICS **
వారు ధన్యులైన పిల్లలు భూలోకమందు వారు ధన్యులైన పిల్లలు
కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన
వారికిని విధేయులైన
కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన
వారికిని విధేయులైన
||వారు||
1. అన్నదములందు నెటులను తనతోడ నాడు చున్న యితరులందు
నటులను భిన్న మెంచ కొక్కరీతిఁ దన్నుఁబోలె ప్రియ మొనర్చి తిన్నని
బడియందు నేర్చు చున్నవార లెవ్వరో
||వారు||
2. ఒక్కఁడె తండ్రి యతఁడు దేవుఁడు మన కందరకును సకల సుఖములిచ్చు
నెప్పుడు అకట మన మిఁకను జగడము లాడఁదగదు ప్రభుని రీతి
నొకని నొకఁడు ప్రియము చేసి యుండుద మని తలఁచుచుండు
2. ఒక్కఁడె తండ్రి యతఁడు దేవుఁడు మన కందరకును సకల సుఖములిచ్చు
నెప్పుడు అకట మన మిఁకను జగడము లాడఁదగదు ప్రభుని రీతి
నొకని నొకఁడు ప్రియము చేసి యుండుద మని తలఁచుచుండు
||వారు||
3. మంచి మేలు లనుభవింపఁగఁ గరుణించి దేవుఁ డెంచి మనల నిచటఁ
గూర్చెఁగ వంచనలఁ ద్యజించి కనిక రించి యొకనినొకఁడు మది స
హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో
3. మంచి మేలు లనుభవింపఁగఁ గరుణించి దేవుఁ డెంచి మనల నిచటఁ
గూర్చెఁగ వంచనలఁ ద్యజించి కనిక రించి యొకనినొకఁడు మది స
హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో
||వారు||
4. ఆకసమున నున్న దేవుఁడు మన మనసు రాక పోక లన్ని చూచు
నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగఁ జేసి
ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో
4. ఆకసమున నున్న దేవుఁడు మన మనసు రాక పోక లన్ని చూచు
నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగఁ జేసి
ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో
||వారు||
** ENGLISH LYRICS **
Vaaru Dhanyulaina Pillalu Bhoolokamandhu Vaaru Dhanyulaina Pillalu
Kori Vichaaramunu Prabhuni Saara Vaakya Medhanu Betti Vaari Vaari Kitharulaina
Vaarikini Vidhaeyulaina
||Vaaru||
1. Annadhamulandhu Netulanu Thanathoda Naadu Chunna Yitharulandhu
Natulanu Bhinna Mencha Kokkareethi Dannu Baola Priya Monarchi Thinnani
Badiyandhu Naerchu Chunnavara Levvaro
||Vaaru||
2. Okkadae Thandri Athadu Dhaevudu Mana Kandharakunu Sakala Sukhamulichchu
Neppudu Akata Mana Mikanu Jagadamu Laadathagadhu Prabhuni Reethi
Nokani Nokadu Priyamu Chaesi Yundudha Mani Thalanchuchundu
||Vaaru||
3. Manchi Maelu Lanubhavimpaga Karuninchi Dhaevudu Enchi Manala Nichata
Goorchaga Vanchanala Thyajinchi Kanika Rinchi Okaninokadu Madhi Sa
Hinchi Manchi Kriyalatho Varthimpa Nishchayinthu Revaro
||Vaaru||
4. Aakasamuna Nunna Dhaevudu Mana Manasu Raaka Poka Lanni Choochu
Neppudu Aekamugaa Hrudhayamulu Vi Vaekamuna Velunga Jaesi
Praakaatamugaa Prabhuni Aagna Gaikoniyaedi Vaara Levvaro
||Vaaru||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------