3358) సువార్తను చాటింప సు సమయంబిది యేను

** TELUGU LYRICS **

    సువార్తను చాటింప - సు సమయంబిది యేను
    శ్రీ యేసుని నామంబు - ఎంతో మధురము మనకు

1.  సంతసమున సాగెదము - పురికొల్పుచు మనస్సులము
    సంకటములు ఎన్నయిన - చనిపోవుటె మేలనుచు

2.  సిలువను మోయుచు భుజమున్ - చేత సువార్తలనూని
    లోకమునకు చాటెదము - ప్రశాంతుడగు యేసున్

3.  త్రియేకునికే యిలలో - జయ మార్భటించెదము
    జయశాలులుగా మేము - జగ దేవత నొణికింతుం

4.  ప్రవక్తలలో ఘనుడు - పరమున దూతలు పొగడున్
    నేత్రముల కాయన తార - అరుణోదయ నక్షత్రం

5.  చిరునగవులతో మేము - చిందింతుము రక్తమును
    హృదయాలు ప్రకాశించున్ – మనసానందంబిదియే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------