3296) సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా

** TELUGU LYRICS **   

    సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా
    దావీదు చిగురు దేవతనయా
    దేవాగొఱ్ఱెపిల్లవు నీవే స్తుతులకు యోగ్యుడవు (2)
    ఆ . . ఆ . . హల్లెలూయా మా మహరాజా
    హొసన్నా హొసన్నా హల్లేలూయా ! శ్రీయేసురాజా
    ఆ . . ఆ . .

1.  ప్రభువుల ప్రభువు రాజులరాజు ప్రతివాని మోకాలు వంగవలె
    ప్రభుయేసు క్రీస్తేదేవుడని ప్రతివాని నాలుక ఒప్పవలె . . ఆ . .

2.  సర్వాధికారి సత్యస్వరూపి సర్వేస్వర నీవు సృష్టికర్తవే
    మహిమాప్రభావము ఇహపరములలో ప్రభువాపొందఅర్హుడవు . . ఆ . .

3.  అల్ఫా ఓమేగ ఆమెన్ అనువాడా యుగయుగములకు మహారాజా
    నామములన్నిట ఉన్నతనామం ప్రణుతింతునిన్ను కౄపామయా . . ఆ . .

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------