3295) సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు


** TELUGU LYRICS **

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2)
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు              
||సాక్ష్య||

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2)
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో 
||సాక్ష్య||

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2)
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము
||సాక్ష్య||

బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2)
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు
||సాక్ష్య||

పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2)
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు
||సాక్ష్య||

చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2)
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు 
||సాక్ష్య||

పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2)
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు 
||సాక్ష్య||

ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2)
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర
||సాక్ష్య||

** ENGLISH LYRICS **

Saakshyamichcheda
Mana Swaami Yesu Devu Danchu
Saakshyamanaga Ganina Vinina
Sangathulanu Delputaye (2)
Saakshya Michchu Koraku Nannu
Swaami Rakshinche Nanchu     
||Saakshyamichcheda||

Dikku Desayu Leni Nannu
Devudentho Kanikarinchi (2)
Makkuvatho Naaku Netlu
Manashshaanthi Nichchinado
||Saakshyamichcheda||

Palletoolla Janula Rakshana
Bhaaramu Naa Paini Galadu (2)
Pillalakunu Beddalakunu
Brematho Naa Swaanubhavamu
||Saakshyamichcheda||

Bodha Cheyalenu Vaada
Mulaku Bonu Naaka Dela (2)
Naadhu desu Prabhuni Goorchi
Naaku Delasinantha Varaku  
||Saakshyamichcheda||

Paapulakunu Mithrudanchu
Braana Mosagi Lechenanchu (2)
Baapamula Kshaminchu Nanchu
Brabhuni Vishwasinchu Danchu 
||Saakshyamichcheda||

Choru laina Jaaru lanaa
Chaaru laina Nevvaraina (2)
Ghorapaapu laina Kreesthu
Koormitho rakshinchu Nanchu 
||Saakshyamichcheda||

Paramatha Dooshanamu Laela
Parihasinchi Paluku Taela (2)
Irugu Porugu Vaari kella
Yesu Kreesthu Devu Danchu 
||Saakshyamichcheda||

Ellakaala Moorakunda
Nela Yaathma Shaanthi Leka (2)
Thalladillu Vaaralakunu
Thandri Kumaa Raathma Pera 
||Saakshyamichcheda||

------------------------------------------------------------------
CREDITS : మల్లెల దావీదు (Mallela Daaveedu)
------------------------------------------------------------------