3177) సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమజూచి

** TELUGU LYRICS **

    సంతసిల్లును మీ హృదయాలు
    సీయోను మహిమజూచి (2)

1.  సుందర వరుడు యేసు ప్రభువు - సుందరవతి సీయోను
    శాశ్వత శోభాతిశయముతో - భాసిల్లుటను జూచి

2.  నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులు
    సూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము

3.  నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములు
    స్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము

4.  జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానము
    కాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము

5.  స్వర్ణ సమము దాని ప్రజలు సంతోష సహితులు
    దూతలే వింతపడునట్లు ఖ్యాతిని కలిగిన వారు

6.  మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారు
    ఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు

7.  దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేది
    జరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------