** TELUGU LYRICS **
సంతసంబున వత్తు సర్వేశ్వరుని చిత్త మెంతయు నెరవేర్చను వంతలు
విడి నాదు నంతరంగము కదుర నెంతో విశ్వాసమున వెంట వత్తును
బ్రభువా

||సంత||
1. సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును
మరియ మనసుతో మర్తమ్మ కరములతోఁ బరమ సౌఖ్యముఁ బొంద
భక్తితో సేవింతు
||సంత||
2. నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోఁచదు
సారెసారెకుఁ దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస
గును

3. కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ
రాజ్యమునఁగల యాస్తికై నా చిత్త మాలసింపఁగ నెత్తి యందే స్థిరముగ
నుంచు

4. ఈ యుర్వి నేఁజేయు సేవకు ఫలములు నీ చోటఁ గనుఁగొందునే
కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున
మండు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :