** TELUGU LYRICS **
రేయింపగలు నీ పదసేవే యేసు ప్రభువా చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవె నాదు కోట కొండయు నీవె

1. పరమపురిలో వరదా నిరతం దూతగణముల స్తుతులను సల్పి
శుద్ధుడ పరిశుద్ధుడనుచు పూజనొందె దేవుడ నీవె
||రేయి||
2. జిగటమన్నే మానవులంతా పరమకుమ్మరి ప్రభుడవు నీవే
సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా

3. పెంటకుప్పలనుండి దీనుల పైకిలేపు ప్రభుడవు నీవే
గర్వమణచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవ గడ్డి

4. నరుల నమ్ముట కంటె నిజముగ నీదు శరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె రాజరాజవు నాకాశ్రయము
||రేయి||
5. అగ్నివాసననంటకుండా అబెద్నగోలతో నుండి నదేవా
దానియేలును సింహపుబోనులో ఆదుకొన్న నాధుడనీవె

6. పరమగురుడవు ప్రభులకు ప్రభుడవు వరము చేర్చు పదము నీవే
అడుగుజాడల నడచిన హనోకు పరముచేరె ప్రాణముతోడ

7. మృతుల సహితము లేపినావు మృతినిగెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు మృత్యువును మృతిలేపినావు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :