2882) రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము

** TELUGU LYRICS **

    రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము

1.  జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ
    రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ 
    ||రమ్ము రమ్ము||

2.  సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత
    స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల
    ||రమ్ము రమ్ము||

3.  అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము
    నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల
    ||రమ్ము రమ్ము||

4.  నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ
    మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల
    ||రమ్ము రమ్ము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------