2881) రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము

** TELUGU LYRICS **

    రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము
    నీదు కృపను నింపు మా డెందముల్ నెమ్మదిఁ బొందంగ 
    ||రమ్ము||

1.  జీవంపు టూటవు ప్రేమ జ్వాల వీవె దేవ దాన మీవె యాద
    రించువాఁడ
    ||రమ్ము||

2.  దేవహస్త మీవె వరము లన్ని నీవె నీవె తండ్రి వాగ్ధ త్తమ్మయి
    వెలుగుచుండు
    ||రమ్ము||

3.  మాటలాడు శక్తి నిచ్చి నాయాత్మను మేటిల్ల నను నభి షేకించుమీ
    దేవ
    ||రమ్ము||
4.  ఇమ్ము నీదు వెలుఁగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకుఁ తోడు నన్ను
    బలపర్చుమా
    ||రమ్ము||

5.  పారదోలు దవ్వు నాత్మ శత్రువుల నిం పార నీదు నెమ్మ దిచ్చి ప్రోవు
    నన్ను
    ||రమ్ము||

6.  ముందు నీవు నడువ నన్ను డాయ దేది యిందు నన్ను ఁ జెరచు
    వారు లేరు భువిని
    ||రమ్ము||

7.  జనకుఁ జూపు నాకు నట్లె చూపు సుతుని ననయ మెఱిఁగి దేవ నిను
    నమ్మి జీవింప
    ||రమ్ము||
    
8.  జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు
    దయ నంపుమా
    ||రమ్ము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------