2925) రాతి కుండను నేను ఖాళియై యున్నాను

** TELUGU LYRICS **    

    రాతి కుండను నేను - ఖాళియై యున్నాను
    నింపుమా.. అంచులవరకూ (2)
    నీకింపుగా.. మార్చబాడుటకు 
(2)

1.  వెఱ్ఱి ద్రాక్షలు.. లోనికి చేరెను - అంతరంగము చేదుగా మారెను.
    మాధుర్యం పంచుటకు.. తగిన పాత్రగా 
(2)
    శుభ్రము చేయుమా - నను శుభ్రము చేయుమా
    నింపుమా.. అంచులవరకూ 
(2)
    నీకింపుగా.. మార్చబడుటకు 
(2)

2.  జీవ డంభము మిగిలి యుండెను - లోకస్నేహము చెరుపుచుండెను
    మాలిన్యం ఏమాత్రం అంటకుండగా 
(2)
    భద్రము చేయుమా - నను భద్రము చేయుమా
    నింపుమా.. అంచులవరకూ 
(2)
    నీకింపుగా.. మార్చబడుటకు 
(2)

3.  తప్పుబోధకు కలతచెందక - చెడ్డమాటతో శ్రమను పొందక
    నీకోసం నమ్మికతో - ఎదురుచూడగా 
(2)
    సిద్ధము చేయుమా - నను సిద్ధము చేయుమా
    నింపుమా.. అంచులవరకూ (
2)
    నీకింపుగా.. మార్చబడుటకు 
(2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------