2930) రారండి యేసు పాదముల చేర పాప విముక్తి పొంద

** TELUGU LYRICS **

    రారండి యేసు పాదముల చేర - పాప విముక్తి పొంద
    అను పల్లవి: వచ్చువారల త్రోయనని - నెచ్చెలు డేసు వాక్కు నిచ్చెను

1.  జాగేల పాపి నీవింకను చావునకు తప్పెదవా?
    సద్గురు చరణము వెదకిన - సద్గుణముగ నిను మార్చును

2.  ఆశతో యేసు నిలిచియున్నాడు పాపీ నిన్ను రక్షింపను
    జీవితము మోసమగుచున్నది - పాపీ యేసుని రక్షణ వెదుక

3.  నేడే నే మరణించిన నెచట చేరుదునని తలచి
    యేసుని చెంత రమ్ము తరుణము - దొరుకదు గుణపడుము వేగమే

4.  ఈ ప్రేమ ఉత్కృష్టమని యెంచి వెంటనే రారమ్ము
    నీదు పాపముల క్షమింపను - నాథు డేసుడు సిల్వ నెక్కెను

5.  పాపము శాపము తోడను వచ్చెదనని చెప్పుము
    జీవ దేవాది దేవుడు నీకై - చేయునదెల్ల పరికింపను

6.  మాయవేషముల ధరియించి కాలము వ్యర్థపరచి
    తప్పుడు బోధ చేయువారల - వీడి పరమున జేరనిచటకు

7.  కడపటి కాలమిదే యగును ఇల మోసపోకుడి
    మిత్రుడేసుడు మీకు ఇచ్చిన - దాని పొందుచు పాడు డల్లెలూయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------