2931) రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము

** TELUGU LYRICS **

    రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము
    రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన

1.  సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు
    దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును

2.  పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా
    లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా

3.  దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము
    క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో

4.  నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును
    నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును

5.  యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు
    ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము

6.  ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు
    ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము

7.  యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా
    యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------