3581) పలుమార్లు నే పడిపోయినను పిలిచిన నీ ప్రేమ మరతునా

** TELUGU LYRICS **

నీ మాటను నేను లక్ష్యము చేయని క్షణాలు లెక్కలేనివి,
కాని నన్ను రక్షించాలను నీ లక్ష్యము,
నా నిర్లక్ష్యమును లక్ష్యము చేయక,
పాత్రుని కాని నన్ను పర్వతంపై నిలిపి,
పరవసించే నీ ప్రేమ పదాలలో పట్టజాలనిది, యేసయ్య

పలుమార్లు నే పడిపోయినను
పిలిచిన నీ ప్రేమ మరతునా
నాకున్న సర్వం అర్పించినా
నీ ఋణము నే తీర్చగలనా
వర్ణింపగలన లెక్కింపతగునా
మితిలేని ప్రేమకు పాత్రుడనా

గమ్యము మరచి - లోకంతో నడచి
త్రోవను విడచి - నే తొలగిపోగా
చిక్కుకొంటినయ్య నా యేసయ్య
మార్పులేని నీ ప్రేమతో
మహిమ గల నీ వాక్కుతో
రక్షించి - నడిపించి - అరచేతిలో చెక్కిన - నిను
వర్ణింపగలన - లెక్కిపతగునా
మితిలేని ప్రేమకు పాత్రుడనా

అపారమైన నీ ప్రేమను,
పొందుతూ, పంచుతూ,
పరుగెడుతున్న నిన్ను చేరేవరకు...

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------