3580) సున్నుతించుమా సంఘమా కీర్తించుమా కుటుంబమా



** TELUGU LYRICS **

సున్నుతించుమా సంఘమా 
కీర్తించుమా కుటుంబమా (2)
ప్రస్తుతించుమా ప్రపంచమా 
పొంగి పొర్లుమా పరలోకమా (2)
ప్రభుయేసు రానైయున్నాడు 
ప్రతి మోకాలు వంగబడును (2) 
||సున్నుతించుమా|| 

కడబూరా వినబడున్ ప్రభుయేసు కనబడున్ (2)
సమాధులు తెరవబడున్ 
పరిశుద్ధులు లేపబడున్ (2) 
||ప్రభుయేసు|| ||సున్నుతించుమా|| 

పరిశుద్ధులంతా చేరుకొని పరలోక విందులో పాల్గొన్ (2)
ప్రభుయేసే జీవహారమగున్ 
పరలోకమంతా ఉప్పొంగున్ (2) 
||ప్రభుయేసు|| ||సున్నుతించుమా|| 

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------