3582) నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు


** TELUGU LYRICS **

నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
రేపు ఏమి జరుగునో తెలియదు నీకు (2)
కురిసిన వర్షం మరలా కురవక ముందే
తేజస్సుకు చీకటి కమ్మక ముందే (2)
ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో 
||నిన్న||

అంకెలలో లేదయ్యా నీ జీవితం
నీ కాలగతులు యెహోవా వశం (2)
నీ అరచేతిలో గీతలు నీ తలరాతలు కాదు
ఆ గీతలే లేకుంటే చేయి ముడుచుకోదు (2)
అధికముగా ఆలోచించి అలసిపోకు సోదరా 
నీ బలహీనత గమనించి జ్యోతిష్యపు మాయరా
||నిన్న||

చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు
సింహమైన చచ్చునని ఎరిగి బ్రతికితే చాలు (2)
బలమూ ధనమూ స్థిరము కాదు ఎరుగుము
ప్రేమా సత్యములో చివరి వరకు ఎదుగుము (2)
మనస్సు దేవునికిచ్చి మహిమలోకి చేరుము
ఆత్మతో ఆరాధించి దేవుని కృప పొందుము
||నిన్న||

నీ వంశము వృక్షమై శాఖలుగా ఎదిగినా
లోకమంతా నీ ముందు భీతితో ఒదిగినా (2)
అధికారివే అయినా ఐశ్వర్యమెంత ఉన్నా
రాజువైన మరణానికి దాసుడవే రన్నా (2)
నీ దేహం ప్రభువుకు సజీవముగా అర్పించు
తీర్పులోకి రాకుండా నీ ఆత్మను తప్పించు
||నిన్న||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments